కరోనా పని దాదాపుగా అయిపోయిందని అనుకున్నారంతా. కొవిడ్ టీకా రాకముందే దాన్ని జయించేశామంటూ గొప్పలు చెప్పుకుంటున్నారు. టీకా వేయించుకోడానికి కూడా చాలామంది సుముఖత చూపలేదంటే.. కరోనా భయం ప్రజల్లో పూర్తిగా తగ్గిపోయిందని అంచనా వేయొచ్చు. అయితే అంతసంబరపడొద్దని హెచ్చరిస్తున్నారు వైద్య నిపుణులు. దేశంలో కరోనా కేసుల సంఖ్య రోజు రోజుకీ తగ్గిపోతున్నా.. కొత్తగా కేరళ, మహారాష్ట్ర లలోకేసుల సంఖ్య పెరగడం ఆందోళన కలిగిస్తోంది.