దేశవ్యాప్తంగా కరోనా కేసులు తగ్గుతున్నా.. మహారాష్ట్ర లాంటి కొన్ని చోట్ల మాత్రం మళ్లీ కేసులు పెరుగుతున్నాయి. దీంతో లాక్ డౌన్ దిశగా ఆ రాష్ట్ర ప్రభుత్వం కఠిన నిర్ణయాలు తీసుకుంటోంది. గతంలోలాగానే వీకెండ్ లాక్ డౌన్ పేరుతో ఆంక్షలు విధిస్తున్నారు అధికారులు. కరోనా కేసులు మళ్లీ పెరుగుతండటంతో మహారాష్ట్రలోని అమరావతి జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. జిల్లా వ్యాప్తంగా వీకెండ్ లాక్ డౌన్ విధిస్తున్నట్టు కలెక్టర్ శైలేష్ నావల్ ప్రకటించారు.