మార్చి 15 అర్థరాత్రి నుంచి ఫాస్టాగ్ లేని వాహనాలకు టోల్ గేట్ల వద్ద అనుమతి లేదంటూ కేంద్రం నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో వాహనదారులు అవస్థలు పడుతున్నారు. దీంతో కేంద్రం వినియోగదారులకు అనుకూలంగా ఓ అడుగు ముందుకేసింది. ఇప్పటికే టోల్ గేట్ల వద్ద ఉచితంగా ఫాస్టాగ్ నమోదుకి అవకాశం కల్పించిన కేంద్రం.. తాజాగా దాన్ని మార్చి 1 వరకు పొడిగిస్తామని చెప్పింది. ఇకపై మార్చి 1 వరకు అన్ని టోల్ గేట్ల వద్ద ఉచిత ఫాస్టాగ్ నమోదు ప్రక్రియ చేపడుతున్నట్టు స్పష్టం చేసింది.