కేంద్ర ఆహార శాఖ మంత్రి పీయూష్ గోయల్ రేషన్ సరకుల రేట్ల పెంపుపై స్పందించారు. ఆన్ లైన్ ద్వారా జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన ఈ విషయంపై క్లారిటీ ఇచ్చారు. ప్రస్తుతానికి రేషన్ సరకుల రేట్లు పెంచే ఆలోచన కేంద్రానికి లేదని స్పష్టం చేశారు. రేషన్ సరకులపై భారం మోపితే ప్రజలు ఇబ్బందులు పడతారని, అందుకే కేంద్రంద అలాంటి నిర్ణయం తీసుకోలేదని చెప్పారు. ప్రజలెవరూ అపోహలు పెట్టుకోవద్దని, కేంద్రం సబ్సిడీపై ఇచ్చే రేషన్ సరకులు యథావిధిగానే కొనసాగుతాయని అన్నారు.