కరోనా కారణంగా అన్నిచోట్ల ఈ ఏడాది స్కూల్స్ ఆలస్యంగా తెరిచారు. ముందుగా 9, 10 తరగతుల పిల్లలను అనుమతించి, ఆ తర్వాత ప్రైమరీ సెక్షన్లు మొదలు పెట్టారు. అయితే తెలంగాణలో మాత్రం ఇంకా ప్రైమరీ సెక్షన్ మొదలు కాలేదు. అసలు 6, 7, 8 తరగతులు కూడా ఇంకా ప్రారంభించలేదు. కేవలం 9, 10 తరగతులను మాత్రమే కొనసాగించే యోచనలో ఉంది ప్రభుత్వం.