ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం పంచాయతీ ఎన్నికల హడావుడి నడుస్తోంది. ఇప్పటికే పంచాయతీ ఎన్నికలు మూడు దశలు పూర్తి చేసుకుంది. చివరి విడత పోలింగ్‌కు అధికారులు సన్నద్ధం అవుతున్నారు. ఈ నేపథ్యంలో కొన్ని ప్రాంతాల్లో వెరైటీ ఓటర్ కార్డులు బయటపడుతున్నాయి. సినిమా హీరోహీరోయిన్ల పేర్లతో ఓటర్ కార్డులు వెలుగు చూసిన ఘటనలు గతంలో చాలా చోటు చేసుకున్నాయి.