బీజేపి మహిళా నేత కారులో డ్రగ్స్ దొరకడం కలకలం రేపుతోంది.ఈ ఘటన పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో చోటుచేసుకుంది. అరెస్ట్ అయిన మహిళ నాయకురాలును బీజేపీ యూత్ లీడర్ పమేలా గోస్వామిగా గుర్తించారు. వివరాలు.. బీజేపీ యూత్ నాయకురాలుగా ఉన్న కొకైన్ తరలిస్తున్నారనే కొద్దిపాటి సమాచారం పోలీసులకు అందింది. దీంతో పోలీసులు శుక్రవారం తనిఖీలు నిర్వహించిన పోలీసులు ఆమె కారులో కొకైన్ తరలిస్తున్నట్టుగా గుర్తించారు. ఆమె బ్యాగ్ ఓపెన్ చేసి చూడగా.. అందులో మత్తు పదార్థాలు ఉన్నట్టు గుర్తించారు. అలాగే కారులోని సీట్ల కింద మత్తు పదార్థాలను దాచి ఉంచినట్టు కనుగొన్నారు. వాటి విలువ లక్షల్లో ఉంటుందని పోలీసులు అంచనా వేస్తున్నారు...