కుప్పం నియోజకవర్గంలో పంచాయతీలన్నీ వైసీపీ కైవసం కావడంతో చంద్రబాబు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. అక్కడ వైసీపీ గెలవలేదు, ప్రజాస్వామ్యం ఓడింది అని ఓ స్టేట్ మెంట్ ఇచ్చినా.. ఆ తర్వాత దానిపై పోస్ట్ మార్టం ప్రారంభించారు. కుప్పంలో రిజల్ట్ అలా ఎందుకొచ్చిందంటూ నియోజకవర్గ నేతలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమీక్షలో స్థానిక నేతలపై బాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్టు సమాచారం.