టీడీపీ ప్రభుత్వం అట్టహాసంగా ప్రారంభించిన అన్న క్యాంటీన్లను వైసీపీ అధికారంలోకి రాగానే ఆపివేసింది. క్యాంటీన్లలో భోజనం, టిఫిన్ అమ్మకాలకు స్వస్తి పలకడమే కాకుండా.. వాటికి తాళాలు వేసింది. చాలా చోట్ల ఇలాంటి అన్న క్యాంటీన్లు వార్డు సచివాలయాలుగా మారిపోయాయి. మిగిలిన చోట్ల తాళాలు వేసిన క్యాంటీన్ నిర్మాణాలు వెక్కిరిస్తున్నాయి. రెండేళ్లవుతున్నా వాటిని నిరుపయోగంగా పడేయడంపై విమర్శలు వినిపిస్తున్నాయి. దీంతో ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించిన వైసీపీ ప్రభుత్వం క్యాంటీన్లను ఆప్కో షో రూమ్ లు గా మార్చేందుకు సిద్ధమైంది.