తమకి పని ఒత్తిడి ఎక్కువైందని, జీతాలు పెంచాలంటూ ఇటీవలే వాలంటీర్లు రోడ్డెక్కారు. అయితే మీది సేవే, ఉద్యోదం కాదని, మీకు జీతాలు పెంచే ప్రసక్తే లేదని తేల్చి చెప్పింది ప్రభుత్వం. ఆ వివాదం అంతటితో సర్దుబాటు అయిందని ఎవరూ అనుకోవడంలేదు, అయితే ప్రభుత్వానికి ఎదురెళ్లడం ఇష్టంలేక వాలంటీర్లే వెనక్కి తగ్గారు. ఇక ఇప్పుడు కొవిడ్ వారియర్స్ పేరుతో.. కరోనా కష్టకాలంలో ఉద్యోగాల్లోకి తీసుకున్న ఆరోగ్య సిబ్బంది తమ సంగతేంటని ప్రశ్నిస్తున్నారు. కరోనా టైమ్ లో ఒప్పంద సేవకుల పేరుతో తమని పనిలోకి తీసుకున్నారని, ఇప్పుడు విధులకు వద్దు పొమ్మంటున్నారని రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనబాట పట్టారు.