పంచాయతీ తుదిపోరుకి రంగం సిద్ధమైంది. ఆదివారం నాలుగో దశ ఎన్నికలకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ దశలో తుది పోరులో ఆధిపత్యం కోసం అభ్యర్థులు సర్వ శక్తులు ఒడ్డుతున్నారు. ప్రత్యర్థి శిబిరం నుంచి వలసలు ప్రోత్సహిస్తూనే.. డబ్బు, మద్యం ఎరవేస్తున్నారు. నెల్లూరు జిల్లాలో వీటికి అదనంగా నిత్యవాసరాల సరఫరా కూడా ఊపందుకున్నట్టు తెలుస్తోంది.