శ్రీకాళహస్తి లో టీడీపీ నేతలు ఆందోళనకు దిగారు. టీడీపీ నేతల పై తప్పుడు కేసులు పెడుతున్నారని నేతలు గగ్గోలు పెడుతున్నారు.తెదేపా సానుభూతిపరులపై తప్పుడు కేసులు పెడితే సహించబోమని ఆ పార్టీ నియోజకవర్గ బాధ్యుడు బొజ్జల సుధీర్‌రెడ్డి అన్నారు. తొట్టంబేడు పోలీసుస్టేషన్ వద్ద శుక్రవారం పోలీసుల తీరుకు నిరసనగా ధర్నా చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వరి కోత సందర్భంగా కూలీలకు నగదు చెల్లించి మిగిలిన రూ.8500 నగదును ఇంటికి తీసుకెళ్తున్న బోనుపల్లికి చెందిన శ్రీనివాసుల నాయుడును పోలీసులు అరెస్టు చేయడం సరికాదన్నారు.