పంచాయతీ ఎన్నికల్లో మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి తన సొంత నియోజకవర్గంలో మరోసారి సత్తా చాటుకున్నారు. ఏకగ్రీవాలతోనే బలం నిరూపించుకున్న వైసీపీ, ఎన్నికల్లోనూ ప్రత్యర్థులను చిత్తు చేసింది. కొన్నిచోట్ల టీడీపీ తరపున అభ్యర్థులే కరువయ్యారు. దీంతో వైసీపీ రెబల్ అభ్యర్థులే వైసీపీతో పోటీ పడ్డారు. విజేతలు ఎవరైనా తిరిగి వైసీగూటికే చేరుకోవడంతో పార్టీలో సందడి పెరిగింది. తాజాగా మున్సిపల్ ఎన్నకల్లోనూ మంత్రి సునాయాస విజయాన్ని ఆశిస్తున్నారు. దానికి తగ్గట్టే ఆత్మకూరు మున్సిపాలిటీలో వైసీపీ ప్రణాళికలు సిద్ధం చేసుకుంటోంది.