దేశంలో పెట్రోలు, డీజిల్ ధరలు రోజురోజుకు తారాస్థాయికి చేరుతున్నాయి. కొన్ని రాష్ట్రాలలో ఇప్పటికి పెట్రోలు, డీజిల్ ధరలు కొత్త గరిష్ట స్థాయికి చేరాయి. ఇక లీటరు పెట్రోలు కొన్ని ప్రాంతాల్లో రూ.100 దాటేసింది. డీజిల్ ధర అయితే రూ.90 పైకి చేరిన సంగతి అందరికి తెలిసిందే. అయితే ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో వాహనదారులపై తీవ్ర ప్రతికూల ప్రభావం పడుతోంది.