విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా చంద్రబాబు ఎట్టకేలకు ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు. అయితే సీఎం జగన్ లేఖ రాసిన 15 రోజుల తర్వాత హడావిడిగా ఇప్పుడే ఆయన ఎందుకు లేఖ రాశారన్నదే సస్పెన్స్. వాస్తవానికి చంద్రబాబుని లేఖ రాయాలంటూ అధికార వైసీపీ చాన్నాళ్లుగా ఒత్తిడి చేస్తూ ఉంది. అయితే మోదీని పల్లెత్తు మాట అనని చంద్రబాబు.. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ పాపం అంతా రాష్ట్ర ప్రభుత్వానిదేనంటూ విమర్శలు గుప్పిస్తూ వచ్చారు.