తెలంగాణలో రాజన్న రాజ్యం తెస్తానంటూ ప్రస్థానం మొదలు పెట్టిన షర్మిల.. ఏపీలో అన్న జగన్ కి తలనొప్పులు తెచ్చేలా ఉన్నారు. తెలంగాణలో పార్టీ పెట్టాలన్నా, పోటీ చేయాలన్నా జై తెలంగాణ అనాల్సిందే, షర్మిల కూడా అదే నినాదంతో ముందుకెళ్తున్నారు. అయితే సోదరి షర్మిల జై తెలంగాణ నినాదం ఏపీలో జగన్ కి ఇబ్బందులు తెచ్చిపెడుతుందని అంటున్నారు కొంతమంది. అక్కడ జై తెలంగాణ, ఇక్కడ జై ఆంధ్ర అనాలంటే కుదరని పరిస్థితి. గతంలో కూడా చంద్రబాబు రెండు కళ్ల సిద్ధాంతం అంటూ ఇబ్బంది పడ్డారు. ఆ తర్వాత ఇప్పుడు జగన్ కుటుంబం.. అక్కడా ఇక్కడా రాజకీయాలు చేయాలంటే కచ్చితంగా ఇబ్బంది పడాల్సి వస్తోందని చెబుతున్నారు రాజకీయ విశ్లేషకులు.