పాలకవర్గం ఏర్పాటై, ప్రజా ప్రతినిధులు ఉంటేనే.. ఎక్కడైనా అభివృద్ధి జరుగుతుంది. ప్రత్యేక అధికారులు ఉన్నా కూడా అభివృద్ధి అనుకున్న స్థాయిలో జరగదని ప్రజలకు బలమైన నమ్మకం. తాజాగా.. రాష్ట్రవ్యాప్తంగా పురపాలక ఎన్నికలకు రెండోసారి తెరలేచినా, నెల్లూరు కార్పొరేషన్ కి మాత్రం మోక్షం లభించలేదు. అయితే దీనికి కారణం వైసీపీయేనని అంటున్నాయి ప్రతిపక్షాలు. అధికార పక్షం కారణంగానే.. వార్డుల పునర్విభజనలో అవకతవకలు జరిగాయని, అందువల్లే టీడీపీ నేతలు కోర్టుకెక్కారని, ఫలితంగా ఎన్నిక వాయిదా పడిందని చెబుతున్నారు.