చిత్తూరులో పలు నియోజక వర్గాల్లో ఎన్నికల పోలింగ్ ప్రారంభం అయ్యింది. కుప్పం , చంద్ర గిరి నియోజక వర్గాల్లో ఎన్నికల పై ఎన్నికల కమీషన్ ప్రత్యేక నిఘాను పెట్టింది.. గత పోలింగ్ లో జరిగిన తప్పులను ఇప్పుడు జరగకుండా చూసుకోవాలని సంభందిత అధికారులకు ఎన్నికల కమీషన్ ఆదేశాలను జారీ చేశారు. సమస్యాత్మక, అత్యంత సమస్యాత్మక ప్రాంతాల్లో పోలింగ్ జరుగుతున్న తీరును పర్యవేక్షించేందుకు, ఎక్కడైనా లోపాలుంటే గుర్తించి వెంటనే సరి చేసేలా వెబ్ కాస్టింగ్ ఏర్పాటు చేశారు.. ఉదయం 7 నుంచి పోలింగ్ కేంద్రాల వద్ద జనాలు బారులు తీరారు. తిరుచానూరు లో ఓటు హక్కును వినియోగించుకునేందుకు జనాలు భారీ వస్తున్నారు. పోలింగ్ మొదలైన గంటకే 35 శాతం ఓటింగ్ నమోదు చేసుకుంది..తుది పోరులో చిత్తూరు జిల్లా లో ఏ పార్టీ జెండాను ఎగురవేస్తారో ఆసక్తిగా మారింది..