మూడు రోజుల్లో 200 వీధి కుక్కలు చనిపోయాయి. కారణం తెలియదు. అసలేం జరిగిందనే విషయం కూడా తెలియదు. దీంతో స్థానికులు హడలిపోతున్నారు. ఇప్పుడు పశ్చిమ బెంగాల్ లో రాబోయే పంచాయతీ ఎన్నికలకంటే ఇదే పెద్ద హాట్ టాపిక్ గా మారింది. అసలు కుక్కలు ఎందు చనిపోతున్నాయనే ఆందోళనలో స్థానికులు అధికారులకు ఫిర్యాదులు చేస్తున్నారు.