దేశంలో తొలిసారిగా సుప్రీం కోర్టు ఓ మహిళకు ఉరిశిక్ష విధించింది. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత తొలిసారి ఉరిశిక్ష ఎదుర్కోబోతున్న మహిళకు రాష్ట్రపతి క్షమాభిక్ష పెడతారా? లేదా? ఇది ఇప్పుడు దేశ వ్యాప్తంగా చర్చనీయ అంశమైంది. ప్రియుడితో కలిసి కుటుంబ సభ్యులను కిరాతకంగా హత్య చేసిన ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన షబ్నమ్‌ను ఉరితీసేందకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.