నారావారిపల్లిలో వైసీపీ జెండా ఎగురవేయాలని ఆ పార్టీ నేతలు తీవ్రంగా ప్రయత్నాలు చేశారని టీడీపీ నేతలు చెబుతున్నారు. అయితే ఓటర్లు వైసీపీ ప్రలోభాలకు లొంగకుండా టీడీపీకి విజయాన్ని అందించారని సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే కుప్పం నియోజకవర్గంలో అత్యధిక స్థానాలు గెలుచుకుని రాష్ట్రస్థాయిలో చంద్రబాబును దెబ్బ కొట్టామని చెప్పుకుంటున్న వైసీపీ ఇప్పుడు ఆయన స్వగ్రామం నారావారిపల్లిపై ప్రత్యేక దృష్టి సారించింది.వైసీపీ మద్దతుదారును గెలిపించుకునేందుకు తీవ్రస్థాయిలో ప్రయత్నించారు.కానీ వారి అంచనాలకు మించి టీడీపీ అభ్యర్థి గెలుపును కైవసం చేసుకున్నాడు..