వాళ్లిద్దరూ ఒక్కరిని ఒక్కరు ప్రేమించుకున్నారు. ఒక్కరిని విడిచి మరొక్కరు ఉండలేరు. వారి ప్రేమ ఎలాగైనా గెలిపించుకోవాలని అనుకున్నారు. అందుకు పెద్దలను ఒప్పించి పెళ్లి కూడా చేసుకున్నారు. అయితే వారి ప్రేమకు గుర్తుగా ముగ్గురు పిల్లలు కూడా పుట్టారు. అంతా బాగుందనుకున్న తరుణంలో భార్య దారితప్పింది. వేరొకరి మోజులో పడి కట్టుకున్న భర్తను అత్యంత కిరాతకంగా హత్య చేసింది. ఈ ఘటన నెల్లూరు జిల్లా గూడూరు పట్టణంలో చోటు చేసుకుంది