రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయని ఓవైపు ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్, మరోవైపు డీజీపీ గౌతమ్ సవాంగ్ తెలిపారు. అయితే ప్రతిపక్ష నేత చంద్రబాబు మాత్రం దీన్ని ఒప్పుకోవడంలేదు. పోలింగ్, కౌంటింగ్ లో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తున్న ఆయన, పోలీసులపై మరోసారి తీవ్ర ఆరోపణలు చేశారు. పంచాయతీ ఎన్నికల కౌంటింగ్ విషయంలో పోలీసులు, అధికార పార్టీ నేతలకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు చంద్రబాబు.