తెలుగు రాష్ట్రాల్లో చాలా చోట్ల.. 10వతరగతి స్కూల్ ఫీజుకంటే ప్రీ ప్రైమరీకి చెల్లించే ఫీజులే ఎక్కువగా ఉంటాయి. ప్రీ ప్రైమరీ ఎడ్యుకేష్ పేరుతో నడిపే స్కూల్స్ లో సరికొత్త లోకం కనిపిస్తుంది. పిల్లలతోపాటు, పెద్దల్ని కూడా ఆకర్షించేలా ఉంటాయి పరిసరాలు. అదే ప్రభుత్వ స్కూల్స్ విషయానికొస్తే.. ప్రీ ప్రైమరీ ఎడ్యుకేషన్ కోసం నడుపుతున్న అంగన్వాడీ స్కూల్స్ లో చాలా వరకు అరకొర సౌకర్యాలే ఉంటాయి, అద్దె భవనానాల్లో నామమాత్రపు సౌకర్యాలతో అంగన్వాడీ సెక్షన్లు తూతూ మంత్రంగా నడుపుతుంటారు. ఇప్పుడా పరిస్థితికి స్వస్తి పలకబోతోంది వైసీపీ సర్కారు. కరోనా గ్యాప్ ని సద్వినియోగం చేసుకుంటూ అంగన్వాడీలకు మెరుగులద్దుతోంది.