ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గం పులివెందులలో అగ్రాసనం దక్కింది. ఆదివారం జరిగిన చివరి విడత ఎన్నికల్లో ఈ నియోజకవర్గంలో నూటికి నూరు శాతం సర్పంచ్ స్థానాలను అధికార పార్టీ అభిమానులు దక్కించుకుని విజయకేతనం ఎగుర వేశారు. ప్రతిపక్ష టీడీపీ మద్దతుదారులు ఈ నియోజకవర్గంలో ఒక్క పంచాయతీ కూడా దక్కించుకోలేకపోయారు.