పంచాయతీ నాలుగు దశల్లో వైసీపీదే విజయం కావొచ్చు, కానీ టీడీపీ మాత్రం తన ఉనికి చాటుకుంది. ఇంకా చెప్పాలంటే, బీజేపీ, జనసేన కూడా అధికార పక్షానికి ఎదురొడ్డి ఒకటీ అరా సీట్లు దక్కించుకున్నాయి. పంచాయతీ సర్పంచ్ లు, వార్డు మెంబర్లు పెద్దగా ఫోకస్ అయ్యే అవకాశం లేదుకాబట్టి అధికార పార్టీ పెద్దగా ఆందోళన చెందట్లేదు. ఇక మున్సిపాల్టీల విషయానికొస్తే.. మున్సిపల్ సమావేశం పెట్టుకున్నప్పుడల్లా ప్రతిపక్ష కౌన్సిలర్లు, కార్పొరేటర్లను ఎదుర్కోవడం అధికార పార్టీకి తలకు మించిన భారంగా మారుతుంది. పొరపాటున ఎక్కడైనా అధికార పార్టీ ఓడిపోతే పరిస్థితి మరింత దిగజారినట్టే. అందుకే పంచాయతీ ఎన్నికలని పెద్దగా పట్టించుకోని సీఎం జగన్ పురపోరుపై మంత్రులకు టార్గెట్ పెట్టినట్టు తెలుస్తోంది.