నేటి సమాజంలో ఒక్క పూట తిండి లేకుండా అయినా ఉంటారేమో కానీ ఫోన్ చూడకుండా ఒక్క క్షణం కూడా ఉండలేరు. అలాంటిది ఫోన్ కి సిగ్నల్ లేకుంటే ఇక వారికీ ప్రాణాలు పోయినట్లే ఉంటారు. ఇక ఫోన్ కి సిగ్నల్ కోసం నానా తిప్పలు పడుతుంటారు. అయితే సెల్ ఫోన్ సిగ్నల్స్ సరిగా లేకపోవడంతో ఓ మంత్రి ఏకంగా జెయింట్ వీల్ ఎక్కారు. మధ్యప్రదేశ్లోని అశోక్ నగర్ జిల్లాలో ఈ ఘటన జరిగింది.