ఉల్లి కోయకుండానే సామాన్యులకు కన్నీలను తెప్పిస్తునాయి.. చమురు ధరలు రోజురోజుకీ పెరుగుతుండటంతోపాటు రెండు రోజుల వర్షం నగర మార్కెట్లపై ప్రభావం చూపింది. దీంతో శనివారం మార్కెట్లలో ఉల్లి ధర అమాంతం పెరిగింది. ప్రస్తుతం రిటైల్ మార్కెట్లలో మొదటి గ్రేడ్ ఉల్లి ధర కిలో రూ.40కి చేరింది. నగరంలోని కిరాణా దుకాణాలు, బహిరంగ మార్కెట్లలో రూ.50 అమ్ముతుండగా, సూపర్ మార్కెట్లలో రూ.46 చొప్పున అమ్ముతున్నారు. గురువారం వరకు రూ.30 ఉన్న ధర రెండురోజుల్లో ఏకంగా రూ.20 పెరగడంతో కొనేందుకు వెనకాడాల్సిన పరిస్థితి ఏర్పడింది.