దేశంలో కరోనా వైరస్ మళ్ళి విజృంభణ కొనసాగుతుంది. ఇప్పటికే మహారాష్ట్ర, కేరళ, పంజాబ్, మధ్యప్రదేశ్, ఛత్తీస్ ఘడ్ లో పంజా విసురుతోంది. ముఖ్యంగా మహారాష్ట్రలో పది రోజుల నుంచి పరిస్థితి తీవ్రమవుతోంది. మూడున్నర నెలల తర్వాత రాష్ట్రంలో కేసులు భారీగా పెరుగుతున్నాయి. దీంతో మహారాష్ట్రలో కఠిన నిబంధనలు అమలవుతున్నాయి.