ఘోర అవమానం, దారుణ పరాభవం. ఏపీలోని మొత్తం 175 నియోజకవర్గాల్లో మొత్తం 6 నియోజకవర్గాల్లో టీడీపీ సున్నా స్కోరుకి పరిమితం అయింది. వైసీపీ దెబ్బకి టీడీపీ అబ్బా అంది. ఆరు నియోజకవర్గాల్లో కనీసం ఒక్కటంటే ఒక్క చోట కూడా సర్పంచ్ స్థానం గెలుచుకోలేక చతికిలపడింది టీడీపీ. గతంలో అధికారంలో ఉన్న పార్టీకి 20నెలలు తిరిగే లోగా ఇంతటి ఘోర పరాభవాన్ని ఎవరూ అంచనా వేయలేదు. అసెంబ్లీలో 23సీట్లు సాధించారన్నమాటే కానీ, ఆ తర్వాత ఆ బలం కూడా తగ్గిపోతూ వచ్చింది. చివరకు టీడీపీ కనీసం సర్పంచ్ అభ్యర్థుల్ని కూడా గెలిపించుకులేని స్థితికి వెళ్లింది.