కేరళ, మహారాష్ట్ర సహా పలు ఇతర రాష్ట్రాల్లో కూడా కరోనా కేసులు పెరుగుతున్న వేళ, తెలంగాణ ప్రజానీకం భయాందోళనలకు గురవుతోంది. మహారాష్ట్రతో సరిహద్దు పంచుకుంటున్న జిల్లాలతో సహా.. తెలంగాణ వ్యాప్తంగా అధికారులు అప్రమత్తం అయ్యారు. అటు మహారాష్ట్రలోని పలు జిల్లాలో వీకెండ్ లాక్ డౌన్, రాత్రి కర్ఫ్యూ ప్రకటించారు. సరిహద్దు రాష్ట్రం తెలంగాణ కూడా రాత్రి కర్ఫ్యూపై ఆలోచిస్తున్నట్టు వార్తలొస్తున్నాయి. తెలంగాణలో రాత్రి కర్ఫ్యూ ప్రకటించారని, ప్రజలు బయటకు రావద్దని కూడా వాట్సప్ గ్రూపుల్లో విపరీతంగా ప్రచారం జరుగుతోంది. దీనిపై మంత్రి ఈటల రాజేందర్ స్పందించారు.