ఆన్ లైన్ లోకి ఆర్డర్లు వచ్చేశాయి..వీధి వ్యాపారుల ఆహార పదార్థాలకు ఆన్లైన్ ద్వారా ఆర్డర్లు స్వీకరించి వినియోగదారులకు డెలివరీ చేయడానికి కేంద్ర గృహ నిర్మాణ, పట్టణాభివృద్ధి మంత్రిత్వ శాఖ ఇటీవల స్విగ్గీతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది.తాజాగా కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ స్విగ్గీతో చేసుకున్న ఒప్పందంతో రోడ్డు పక్కన ఉండే తోపుడు బండ్లు, స్టాల్స్‌లలో ఆహార పదార్థాలు విక్రయించే వీధి వ్యాపారులకు సైతం ఈ సేవలు అందుబాటులోకి రానున్నాయి..ఫుడ్ సేఫ్టీ ట్రైనింగ్ అండ్ సర్టిఫికేషన్ ఆధ్వర్యంలో వీధి వ్యాపారులకు ఆన్లైన్ శిక్షణ అందనుంది. అలాగే పాన్, ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ ఆథారిటీ ఆఫ్ ఇండియా రిజిస్ట్రేషన్ పొందడంలో సహకారం, స్విగ్గీ యాప్ వినియోగంలో శిక్షణ లభించనుంది.