సమాజంలో ఆడపిల్లలకు రక్షణ లేకుండా పోతుంది. రాజకీయ నాయకులు నలుగురికీ ఆదర్శంగా ఉండాలి. దేశ చట్టాలను గౌరవించాలి. కానీ పార్లమెంట్లో చట్టాలు చేసే ఓ ఎంపీనే చట్టాన్ని ఉల్లంఘించాడు. సభ్య సమాజం ఏ మాత్రం అంగీకరించని పని చేశాడు. దాదాపు 60 ఏళ్ల వయుసున్న ఆ ఎంపీ.. 14 బాలికను పెళ్లి చేసుకున్నాడు. పాకిస్తాన్ ఎంపీ మౌలానా సలావుద్దీన్ ఆయుబి మైనర్ బాలికను పెళ్లి చేసుకోవడం ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది.