మీరట్ జిల్లాలోని నౌచందీ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ గెస్ట్‌హౌస్‌లో పోలీస్ కానిస్టేబుల్ మహిళపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. నేరం జరిగిన సమయంలో గెస్ట్‌హౌస్ యజమాని కుమారుడు అక్కడే ఉన్నట్టు సమాచారం. పోలీస్ అరాచకంపై తాను ఫిర్యాదు చేసినా ఎలాంటి చర్యలూ చేపట్టలేదని బాధితురాలు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ఘటనను కప్పిపుచ్చేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారని బాధితురాలు ఆరోపించారు.