వారసత్వంగా వస్తున్న ప్రభుత్వ రంగ సంస్థలను నడపలేమని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ వెల్లడించారు. ఆర్థికంగా ఎంతో నష్టం చేకూరుతోందని.. ప్రైవేటీకరించడమే మేలుగా భావిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. నష్టాల్లో ఉన్న అనేక ప్రభుత్వ రంగ సంస్థలు ప్రజాధనంతో నడుస్తున్నాయని తెలిపారు.