తెలంగాణలో షర్మిల రాజకీయ అరంగేట్రంతో ఏపీలో సీఎం జగన్ పై లేనిపోని అనుమానాలొస్తాయని, ఏపీలో ఆయన పరపతి తగ్గిపోతుందని కొంతమంది అంచనా వేశారు. షర్మిల తెలంగాణకు మద్దతుగా చేసే వ్యాఖ్యలు, ఆ రాష్ట్ర అభివృద్ధికోసం కోసం చేసే పోరాటాలు, కొన్ని సార్లు ఏపీకి పరోక్షంగా ఇబ్బందిగా పరిగణించ వచ్చు. ఆ ఉద్దేశంతోటే తెలంగాణలో వైసీపీని రద్దు చేసుకున్నారు జగన్. అయితే షర్మిల పార్టీ పెడతానంటూ వెళ్లడంతో ఇప్పుడు అసలు చిక్కు వచ్చిపడింది. అయితే షర్మిల తెలివిగా.. తన అన్న జగన్ పై ఒత్తిడి లేకుండా చేస్తున్నట్టు అర్థమవుతోంది.