రాష్ట్రంలోని 75 పురపాలక సంఘాలు / నగర పంచాయతీలు, 12 నగర పాలక సంస్థలకు మార్చి 10న ఎన్నికలు జరగాల్సి ఉంది. మున్సిపల్ ఎన్నికలు జరిగే ప్రాంతాల్లో మొత్తం 9,307 పోలింగ్ కేంద్రాలు న్నాయి. వీటిలో 2,890 పోలింగ్ కేంద్రాలను సమస్యాత్మకమైనవిగా గుర్తించారు అధికారులు. మరో 2,466 కేంద్రాలు అత్యంత సమస్యాత్మకమైనవిగా నిర్థారించారు. గత చరిత్ర చూస్తే ఎప్పుడు ఎన్నికలు జరిగినా, ఈ పోలింగ్ కేంద్రాల్లో మాత్రం గొడవలు కామన్. అందుకే అత్యంత సమస్యాత్మక కేంద్రాల్లో గట్టినిఘా పెట్టాలనుకుంటున్నారు పోలీసులు.