పెళ్లి చూపుల్లో నచ్చి మెచ్చి పెళ్లి చెసుకున్నాడు. మూడేళ్లు కాపురం చేశాక సన్నగా ఉన్నావంటూ వంకలు పెడుతున్నాడు. అందంగా లేవనీ, విడాకులు ఇవ్వాలని ఆ భర్త కోరుతున్నాడు. దీంతో ఆ భార్య తనకు న్యాయం కావాలంటూ ధర్నాకు దిగింది. ఈ ఘటన నిజామాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది.