ఇక భార్యపై ఉన్న ప్రేమతో ఆమె విగ్రహం తయారు చేయించిన సంఘటన తాజాగా ఆంధ్రప్రదేశ్లో వెలుగులోకి వచ్చింది. తనను విడిచి పరలోకాలకు వెళ్ళిపోయిన భార్యపై తనకున్న ఎనలేని ప్రేమను చాటుకున్నాడు ఓ వ్యక్తి. ఆమె మధురస్మృతులు ఎప్పటికీ తనతోనే ఉండాలనే ఉద్దేశంతో భార్యకు ఏకంగా నిలువెత్తు విగ్రహాన్ని తయారు చేయించాడు.