కరోనా టీకా దేశవ్యాప్తంగా ఉచితంగా పంపిణీ చేస్తామని కేంద్రం స్పష్టం చేసింది. అయితే ఈ ఉచితం కేవలం కొవిడ్ వారియర్స్ కే పరిమితమా, సామాన్య ప్రజలకు మాత్రం ఖరీదు కడతారా అనే విషయంపై ఇప్పటి వరకూ క్లారిటీ ఇవ్వలేదు. అయితే కొవిడ్ వారియర్స్ కి టీకా పంపిణీ పూర్తవుతున్న క్రమంలో మార్చి నుంచి 50ఏళ్లు పైబడిన వారికి, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నవారికి టీకా అందుబాటులోకి రాబోతోంది. ఈ దశలో టీకా ప్రైవేటు పంపిణీపై కూడా చర్చ మొదలైంది.