రైతులకోసం ఎన్నో నూతన పథకాలు ప్రవేశ పెట్టి, రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేసి వ్యవసాయానికి దన్నుగా నిలిచారు సీఎం జగన్. అయితే రైతులకు గిట్టుబాటు ధర కల్పించడం వరకే పరిమితం అయితే లాభంలేదు, వారికి సరైన మార్కెటింగ్ సదుపాయాలు కల్పిస్తేనే రైతాంగం బాగుంటుంది. ఆ ఆలోచనతోనే ఇప్పుడు మల్టీ పర్పస్ ఫెసిలిటీ సెంటర్లను ఏర్పాటు చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఏ ప్రాంతానికి చెందిన వ్యాపారులైనా రైతు నుంచి నేరుగా ఉత్పత్తులను కొనుగోలు చేసేలా మల్టీపర్పస్ ఫెసిలిటీ సెంటర్లు ఏర్పాటు కాబోతున్నాయి.