నగర, పురపాలక సంఘాల ఎన్నికల నేపథ్యంలో ఈ నెల 27వ తేదీన రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్ తిరుపతికి రానున్నారు. కార్పొరేషన్లు, మున్సిపాలిటీలకు సంబంధించి జిల్లాలో చేపడుతున్న ఏర్పాట్లపై అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు. గతేడాది కార్పొరేషన్లు, మున్సిపాలిటీల నామినేషన్ల ప్రక్రియ సందర్భంగా జిల్లాలోనే దౌర్జన్యకర సంఘటనలు చోటు చేసుకున్నాయి. తాజాగా పురపాలక సంఘాలకు ఎన్నికల నోటిఫికేషన్‌ను తిరిగి ప్రారంభించిన తర్వాత ఎస్ఈసీ తిరుపతికి రావడం చర్చనీయాంశంగా మారింది.