ఎమ్మెల్సీ అభ్య ర్థుల జాబితాను కూడా వైసీపీ ప్రభుత్వం ప్రకటిస్తుంది. కడప ఎమ్మెల్సీ అభ్యర్థుల పేర్లను ఖరారు చేసినట్లు వైసీపీ ప్రభుత్వం వెల్లడించింది. ఈ మేరకు వైకాపా ఎమ్మెల్సీ అభ్యర్థిగా జిల్లాకు చెందిన సీనియర్ నాయకుడు సి.రామచంద్రయ్య పేరు ఖరారైంది. ఛార్టెడ్ అకౌంటెంట్‌గా పనిచేస్తున్న ఆయన 1982లో తెలుగుదేశం పార్టీలో చేరారు. 1985లో కడప నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 1986 నుంచి 1988 వరకు రాష్ట్ర మంత్రిగా ఉన్నారు. అదే కాలంలో రాష్ట్ర ఫైనాన్స్ కార్పొరేషన్, రాష్ట్ర పౌరసరఫరాల సంస్థల ఛైర్మన్‌గా సేవలందించారు. అనంతరం ఆయన దాదాపు 11 ఏళ్లపాటు రాజ్యసభ సభ్యుడిగా కొనసాగారు.