ప్రస్తుత పరిస్థితుల్లో ముందస్తు ఎన్నికలకు వెళితే మోడీకి చేదు ఫలితాలు ఎదురయ్యే ప్రమాదం ఉంది. అందుకే ఆయన జమిలి ఎన్నికలు అనే విషయాన్ని పూర్తిగా మర్చిపోయారు. దీంతో చంద్రబాబు కి భారీ షాక్ తగిలినట్లయింది. ఎందుకంటే 2024 నాటికి తన ఆరోగ్యం ఎలా ఉంటుందో అని చంద్రబాబు ఆందోళన పడుతున్నారు. త్వరగా ఎన్నికలు వస్తే అధికారంలోకి రావచ్చని.. టీడీపీ సామ్రాజ్యాన్ని కాపాడుకోవచ్చని ఆశపడుతున్నారు. కానీ ముందస్తు ఎన్నికలు వచ్చే అవకాశాలు కనిపించకపోవడంతో చంద్రబాబు ఆశలు నీరుగారుతున్నాయి.