కుప్పంలో పర్యటిస్తున్న చంద్రబాబు, కార్యకర్తల నినాదాలతో ఒక్కసారిగా షాకయ్యారు. కుప్పంలో జూనియర్ ఎన్టీఆర్ వీరాభిమానులున్నారు, వారంతా తమ అభిమాన హీరో పేరుతో నినాదాలు చేసి బాబుకి షాకిచ్చారు. ‘జూనియర్ ఎన్టీఆర్ను ప్రచారానికి రప్పించండి. ఆయనతో కుప్పంలో ప్రచారం చేయించండి’ అంటూ రామకుప్పం, రాజుపేటల్లో నిర్వహించిన రోడ్ షోలో కొందరు టీడీపీ కార్యకర్తలు చంద్రబాబును కోరారు. ఆయితే ఆ మాటల్ని చంద్రబాబు పట్టించుకోనట్టే ఉన్నారు. కాసేపు మౌనం వహించారు. తాను ఇప్పటి నుంచి మూణ్నెల్లకోసారి నియోజకవర్గానికి వస్తానని.. కార్యకర్తలకు అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. అవసరమైతే లోకేశ్, ఇతర నాయకులు కూడా ఇక్కడికి ప్రచారానికి వస్తారని శ్రేణులకు తెలిపారు.