మోటారు వాహన నిబంధనలను ప్రభుత్వం సవరించింది. దీన ప్రకారం ఇకపై ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘిస్తే సాక్ష్యాధారాలతో సహా రికార్డ్ అవుతుంది. అంటే తప్పించుకోడానికి వాహనదారులకు ఎలాంటి అవకాశం ఉండదనమాట. ఎలక్ట్రానిక్ మానిటరింగ్ అండ్ ఎన్ ఫోర్స్ మెంట్ ఆఫ్ రోడ్ సేఫ్టీ పేరుతో నిబంధనలు జతచేసిన ప్రభుత్వం ముసాయిదాని విడుదల చేసింది.