రాష్ట్ర ఎన్నికల కమిషన్ సొంతగా రూపొందించుకున్న ఈవాచ్ యాప్ విషయంలో ఆంధ్రప్రదేశ్ టెక్నాలజీ సర్వీసెస్ లిమిటెడ్ లేవనెత్తిన 24 సందేహాలు, అభ్యంతరాల్లో కేవలం ఆరింటికే ఎస్ఈసీ ఇప్పటి వరకు స్పందించింది. ఈమేరకు రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు నివేదించింది. మిగిలిన వాటికి స్పందన రావాల్సి ఉందని తెలిపింది. ఈ వివరాలను పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు.. ఈవాచ్ యాప్ పై చేపట్టిన విచారణను మార్చి 5కి వాయిదా వేసింది.