చంద్రబాబు మతి స్థిమితం కోల్పోయిన వ్యక్తిలా అసందర్భ ప్రేలాపనలు పేలుతున్నారని, ఆయన ఏం మాట్లాడుతున్నారో టీడీపీ వాళ్లకే అర్థం కావడం లేదని అన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రతి కుటుంబానికి పెద్దగా వారి బాగోగులు ఆలోచించి సంక్షేమ పథకాలు అమలు చేశారని, ఇది ప్రజల హృదయాలకు ఆయనను దగ్గర చేసిందన్నారు. ఇక రానున్న మూడేళ్ల వరకు రాష్ట్రంలో ఎటువంటి ఎన్నికలు లేవు.. టీడీపీ ఇప్పటికైనా కళ్లు తెరచి దుకాణాన్ని మూసేస్తే బెస్ట్ అని అన్నారు. తండ్రికి వయసై పోయిందని.. కొడుకు లోకేశ్ అయినా నేర్చుకుంటాడనుకుంటే అదీ లేదన్నారు. నోటికొచ్చినట్లు తిట్టుకుంటూ పోతే వారి ఖర్మ అని వదిలేయడం తప్ప మరేం చేయలేమన్నారు. ఇప్పుడు జరుగుతున్న మున్సిపల్ ఎన్నికలు కూడా వైసీపీ కి అనుకూలంగా వస్తాయని ధీమాను వ్యక్తం చేశారు..