టీటీడీ వార్షిక బడ్జెట్ ఆమోదించిన ధర్మకర్తల మండలి, తిరుమల శ్రీవారి దర్శనాలకు సంబంధించి పలు కీలక నిర్ణయాలను వెలువరించింది. ఉగాది నుంచి ఆర్జిత సేవలకు భక్తులను అనుమతించాలని నిర్ణయం తీసుకుంది. అయితే ఆర్జిత సేవలు ప్రారంభించే సమయానికి ముందే టీటీడీ ఉద్యోగులకు కరోనా వ్యాక్సిన్ వేయాలనే నిర్ణయం తీసుకుంది టీటీడీ. ఎంపిక చేసిన ప్రైవేట్ ఆస్పత్రుల్లో మార్చి 1 నుంచి వ్యాక్సినేషన్ చేస్తారని పేర్కొన్నారు టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి.