2019 లో జరిగిన సార్వత్రిక ఎన్నికల దగ్గర నుండి ఈరోజుటి వరకు టీడీపీ పతనం చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఈ విషయాన్ని గురించి రెండు తెలుగు రాష్ట్రాలలో ఏ ఒక్కరిని అడిగినా పూస గుచ్చినట్టు చెబుతారు అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. దీనితో టీడీపీలో హుషారు తగ్గిపోయింది. ముఖ్య నాయకులు మరియు కార్యకర్తలు సైతం ఊరకుండిపోయారు. ఎవరో గతంలో మంత్రులుగా పనిచేసిన వాళ్ళు తప్పించి మిగతా నాయకులంతా వారి నియోజకవర్గాల్లో సైలెంటుగా ఉన్నారు. మరి కొందరేమో వైసీపీలోకి వెళ్లారు.